‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
హైదరాబాద్: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత నారాయణ్ దాస్ కె నారంగ్ తెలిపారు.
సినిమా బాగా వచ్చిందని, అయితే, నెమ్మదిగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సినిమా విడుదల తాత్కాలికంగా నిలిపి వేస్తున్నామని దర్శకుడు శేఖర్‌కమ్ముల తెలిపారు. కుటుంబమంతా కలిసి చూడాల్సిన సినిమా ‘లవ్‌స్టోరీ’ అని త్వరలోనే మంచి తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.
‘ప్రస్తుతం ఆరోగ్యమనేది చాలా ముఖ్యం. కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా వేస్తున్నాం. ఇప్పటివరకూ విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇటీవలే సినిమా చూశా. శేఖర్ కమ్ముల నాకు ఒక మంచి సినిమా ఇచ్చారు. అంతా పూర్తయిన తర్వాత సినిమా విడుదల వాయిదా వేయాలంటే నిర్మాతలకు చాలా ధైర్యం ఉండాలి. మా నిర్మాతలకు ధన్యవాదాలు’ అని నాగచైతన్య అన్నారు. పవన్ సీహెచ్ స్వరాలు సమకూర్చిన ‘లవ్‌స్టోరీ’లోని పాటలు విశేషంగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా ‘సారంగదరియా’ పాట విశేష ప్రజాదరణ పొందింది. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
- ఎన్టీఆర్ సరసన కియారా?
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘జాతిరత్నాలు’ దర్శకుడితో రామ్ చిత్రం?
- రామ్‌చరణ్, శంకర్ చిత్రంలో చిరు, సల్మాన్‌ఖాన్?
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
కొత్త పాట గురూ
-
కలర్ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా