New Style Camera: ఆగస్టు 10న షావోమి.. ఆ తర్వాత ఒప్పో - oppo developed new technology for camera under display phones
close
Published : 05/08/2021 00:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

New Style Camera: ఆగస్టు 10న షావోమి.. ఆ తర్వాత ఒప్పో

ఇంటర్నెట్‌డెస్క్‌: మొబైల్ డిస్‌ప్లేని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు గత కొంత కాలంగా మొబైల్ కంపెనీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎడ్జ్‌ టు ఎడ్జ్‌ డిస్‌ప్లే, నాచ్‌ డిస్‌ప్లే వంటి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చాయి. నాచ్‌ డిస్‌ప్లేలో సెల్ఫీ కెమెరా కోసం హోల్‌ ఉండటంతో ఫోన్‌ పూర్తి డిస్‌ప్లే అనుభూతిని యూజర్స్ ఆస్వాదించలేకపోతున్నారట. దీనికి ప్రత్యామ్నాయంగా మొబైల్ కంపెనీలు కెమెరా అండర్‌ డిస్‌ప్లే ఫోన్లు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అంటే కెమెరా పైకి కనిపించకుండా.. ఫోన్‌ స్క్రీన్‌ కింది భాగంలో అమర్చుతారు. దీంతో యూజర్స్ పూర్తి డిస్‌ప్లేని ఆస్వాదించవచ్చు. షావోమి, ఒప్పో లాంటి కంపెనీలు కెమెరా అండర్ డిస్‌ప్లేతో కొత్త ఫోన్లను తీసుకొస్తున్నాయి. మరి వీటిలో ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారో చూద్దాం. 


షావోమి ఎంఐ మిక్స్‌ 4 (Xiaomi Mi Mix 4)

షావోమి త్వరలో అండర్ డిస్‌ప్లే కెమెరాతో ఎంఐ మిక్స్ 4 ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆగస్టు 10న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. షావోమి నుంచి వస్తున్న తొలి కెమెరా అండర్‌ డిస్‌ప్లే ఫోన్‌ ఇదే. ఇందులో సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సర్‌, లైట్ వంటి వాటికి సంబంధించిన మూడు సెన్సర్లు డిస్‌ప్లే కింది భాగంలో ఉంటాయని సమాచారం. ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఫోల్డింగ్ డిస్‌ప్లే ఇస్తున్నారట. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంయూఐ 12.5 ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుందట. ఇందులో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ ఉపయోగించినట్లు సమాచారం. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. 8జీబీ, 12జీబీ ర్యామ్‌/256జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వేరియంట్లలో ఈ ఫోన్ తీసుకొస్తున్నారట. షావోమి ఇప్పటికే ఎంఐ మిక్స్ సిరీస్‌లో ఎంఐ మిక్స్ 3, ఎంఐ మిక్స్ 3  5జీ మోడల్స్‌ను తీసుకొచ్చింది. తాజాగా వాటికి కొనసాగింపుగా 5జీ, కెమెరా అండర్‌ డిస్‌ప్లే, ఫాస్ట్‌ ఛార్జింగ్ ఫీచర్లతో ఎంఐ మిక్స్ 4 మోడల్‌ను విడుదలచేయనుంది. 


ఒప్పో కెమెరా అండర్‌ డిస్‌ప్లే టెక్నాలజీ

కెమెరా, డిస్‌ప్లే మెరుగైన ఫీచర్స్‌తో ఒప్పో కెమెరా అండర్‌ డిస్‌ప్లే టెక్నాలజీ ఉండబోతోందని సమాచారం. చైనాకు చెందిన అతిపెద్ద డిస్‌ప్లే తయారీ సంస్థ బీఓఈతో కలిసి ఒప్పో ఈ  డిస్‌ప్లే టెక్నాలజీని అభివృద్ధి చేసింది. కెమెరా కోసం సరికొత్త పిక్సెల్ ప్రమాణాలను రూపొందించారు. ఇది కెమెరా లెన్స్‌లోని ప్రతి పిక్సెల్‌ సైజ్‌తో కలిసి 440 పీపీఐ (పిక్సెల్ పర్ ఇంచ్) చేరుకుంటుంది. దానివల్ల ఫొటో, వీడియోలు మరింత మెరుగ్గా వస్తాయని ఒప్పో తెలిపింది. అలానే స్క్రీన్‌లో ఎక్కువ కాంతి ప్రసరింపజేసేలా కొత్త ట్రాన్స్‌పరెంట్ మెటీరియల్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫోన్‌ను త్వరలో మార్కెట్లోకి  విడుదలచేయనున్నారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని