బాబూ రణ్‌వీర్‌.. ఏంటయ్యా ఇది! - ranveersingh fashion and trendy looks and netizens comments
close
Updated : 01/07/2021 13:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాబూ రణ్‌వీర్‌.. ఏంటయ్యా ఇది!

బీటౌన్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌పై నెటిజన్ల కామెంట్లు

ముంబయి: సినిమా ఛాన్సుల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి సాధారణ నటుడి నుంచి అనతి కాలంలోనే స్టార్‌గా ఎదిగారు హీరో రణ్‌వీర్‌ సింగ్‌. సినిమా, సినిమాకీ తనలోని నటుడ్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తూ కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నారు ఈ స్టార్‌. నటనలోనే కాకుండా స్టైల్‌లోనూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రతిసారీ కొంగొత్త లుక్స్‌తో రణ్‌వీర్‌ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. బీటౌన్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌గా చెప్పుకునే రణ్‌వీర్‌ సింగ్‌ తాజాగా షేర్‌ చేసిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ప్రముఖ ఇటాలియన్ ఫ్యాషన్‌ డిజైనర్‌ అలెశాండ్రో మిచెల్‌ను ప్రేరణగా తీసుకుని ఆయన మాదిరిగా దుస్తులు, హెయిర్‌స్టైల్‌తో రణ్‌వీర్‌ అందర్నీ ఒకింత అవాక్కయ్యేలా చేశారు. రణ్‌వీర్‌ షేర్‌ చేసిన ఫొటోలు చూసి కొంతమంది ఆశ్చర్యపోతే మరికొంతమంది మాత్రం.. ‘రణ్‌వీర్‌.. ఇవేం లుక్స్‌’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన ట్రెండీ లుక్స్‌తో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు అందుకోవడం మన రణ్‌వీర్‌కు కొత్తేమీ కాదు..! అలాంటి కొన్ని లుక్స్‌ని మీరూ చూసేయండి..!


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని