Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 117435
            [news_title_telugu_html] => ‘లయన్‌’ రాకతో చిట్టి వెనక్కి తగ్గాడా?
            [news_title_telugu] => ‘లయన్‌’ రాకతో చిట్టి వెనక్కి తగ్గాడా?
            [news_title_english] => Rajinikanth film two point o China release may postpone
            [news_short_description] => సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘2.ఓ’ సినిమా చైనాలో విడుదలకు సిద్ధమైందని ఇటీవల నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. జులై 12న ఈ చిత్రాన్ని ఆ దేశంలో విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు చైనా పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. 56 వేల స్క్రీన్లలో సినిమాను ప్రదర్శించబోతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్‌ 28న 

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => ||
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-06-26 18:47:10
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
‘లయన్‌’ రాకతో చిట్టి వెనక్కి తగ్గాడా? - Rajinikanth film two point o China release may postpone - EENADU
close

తాజావార్తలు

‘లయన్‌’ రాకతో చిట్టి వెనక్కి తగ్గాడా?

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘2.ఓ’ సినిమా చైనాలో విడుదలకు సిద్ధమైందని ఇటీవల నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. జులై 12న ఈ చిత్రాన్ని ఆ దేశంలో విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు చైనా పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. 56 వేల స్క్రీన్లలో సినిమాను ప్రదర్శించబోతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్‌ 28న చైనాలో సినిమా ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు.

అయితే హాలీవుడ్‌ సినిమా ‘ది లయన్‌ కింగ్‌’ జులై 19న ఘనంగా చైనాలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీసు వద్ద వసూళ్లు తగ్గుతాయనే ఆలోచనలో ‘2.ఓ’ నిర్మాతలు ఉన్నారట. దీంతో విడుదల తేదీని వాయిదా వేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు పలు వెబ్‌సైట్లలో ప్రచారం జరుగుతోంది. మరి ఈ వదంతులపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.

‘లయన్‌ కింగ్‌’ హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ జులై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కార్టూన్‌ నెట్‌వర్క్‌ కామిక్‌ సీరియల్‌గా మొదలైన ‘లయన్‌ కింగ్‌’ని ఆ తర్వాత డిస్నీ 2డీ యానిమేటెడ్‌ సినిమాగా 1990లో విడుదల చేశారు. ఇది సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు 3డీ యానిమేటెడ్ టెక్నాలజీ, కంప్యూటర్ గ్రాఫిక్స్‌ జోడించి ‘లయన్‌ కింగ్’ను రూపొందించారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.