close

తాజావార్తలు

‘ఇంతకీ ఎవరా హంతకుడు’

ఉత్కంఠ రేకెత్తించేలా ‘రాక్షసుడు’ ట్రైలర్‌

హైదరాబాద్‌: ‘మనం ఊహించిన దానికంటే ఈ కేసులో ఏదో సీరియస్‌నెస్‌ ఉంది’ అంటున్నాడు యువ కథానాయకుడు బెల్లకొండ సాయి శ్రీనివాస్‌. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రాక్షసుడు’. అనుమప పరమేశ్వరన్‌ కథానాయిక. రమేష్‌ వర్మ పెన్మత్స దర్శకుడు. గురువారం ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘నేనంటే భయానికే భయం.. నా గురించి వెతకొద్దు’ అంటూ ఓ సీరియల్‌ కిల్లర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అయిన బెల్లకొండ శ్రీనివాస్‌కు వార్నింగ్‌ ఇస్తున్న డైలాగ్‌లో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సాగింది. ఇంతకీ ఆ హంతకుడు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? వాడిని పోలీసులు ఎలా పట్టుకున్నారు? ఈ నేపథ్యంలో కథానాయకుడికి ఎదురైన సంఘనటలు ఏవి? మొత్తం తెరపై చూడాల్సిందే. 

అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘రాక్షసుడు’ ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.