టపాసు పేలి.. కారు దగ్ధం
close

తాజా వార్తలు

Updated : 17/11/2020 09:19 IST

టపాసు పేలి.. కారు దగ్ధం

శంషాబాద్‌: అది కొత్త కారు. రూ.14లక్షలతో కొనుగోలు చేసి రెండు మాసాలు కాలేదు. దీపావళి వేడుకలను సరదాగా చేసుకోవడానికి ఆ కారులో స్నేహితుల వద్దకు వచ్చాడు. అందరు చూస్తుండగానే కొత్త కారు టపాసుల ధాటికి కాలి బూడిదైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని తొండుపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. శంషాబాద్‌ పోలీసుల వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలం, మోకిలకు చెందిన ఓ యువకుడు కొత్తగా కొనుగోలు చేసిన కారును తీసుకుని తొండుపల్లికి వెళ్లాడు. స్నేహితుడి ఇంటి వద్ద పార్కింగ్‌ చేశాడు. అదే బస్తీకి చెందిన వేణు భారీ(సుత్లీ బాంబు) టపాసులను కాల్చి కారుపైకి పారేయడంతో నిప్పంటుకుంది. స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించినా అదుపులోకి రాకపోవడంతో కారు పూర్తిగా కాలిపోయింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని