close

తాజా వార్తలు

Published : 25/01/2021 07:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పొడిచిన వాళ్లు చిక్కారు

తాగిన మైకంలో విద్యార్థిపై దాడి

పోలీసుల అదుపులో నిందితులు

ఈనాడు, గుంటూరు : గుంటూరు నగరంలో ఇటీవల ఓ విద్యార్థిపై దాడి చేసి.. ఆపై చువ్వతో పొడిచి సారీ నిన్ను కాదూ పొడవాల్సింది వేరేవాళ్లనంటూ ఓ వెయ్యి చేతిలో పెట్టి చికిత్స చేయించుకోవాలని ఉడాయించిన కేసు సంచలనం కలిగించింది. సరిగ్గా వారం రోజుల కిందట నల్లపాడు పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈకేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాధ్యులైన యువకుల్లో కొందరిని అదుపులోకి తీసుకోవటంతో కేసు చిక్కుముడి వీడింది. తాగిన మైకంలో ఆ యువకులు ఈ దారుణానికి తెగబడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

సంగడిగుంటకు చెందిన కొందరు యువకులు రెండు బైకులపై ఈనెల 17న పెదకాకాని పోలీసుల పరిధిలోని ఆటోనగర్‌ వెళ్లారు. అటు నుంచి తిరిగి నగరంలోకి వస్తున్న క్రమంలో వీరిలో ఒకరి బైకును రాసుకుంటూ పక్కనుంచి కారు వేగంగా దూసుకెళ్లింది. అసలే మద్యం మత్తులో ఉండటంతో కోపోద్రిక్తులైన ఆ యువకులు ఎలాగైనా ఆకారును ఛేజ్‌ చేసి పట్టుకోవాలని ప్రయత్నించారు. అందులో భాగంగా ఒక బైకు మీద ఉన్న యువకులు మహాత్మాగాంధీ ఇన్నర్‌ రింగ్‌రోడ్డులోకి మరో బైకుపై ఉన్న వారు ఆర్టీసీ బస్టాండ్‌ వైపునకు వెళ్లారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో వచ్చిన యువకులకు ఆ రోడ్డులో ఓ ప్రదేశంలో కారు ఆగి ఉండటం కనిపించింది. ఆకారు దగ్గరకు చేరుకున్న యువకుల్లో ఒకరు ఏరా నీకెంత ధైర్యం తమను గుద్దేసి వేగంగా వచ్చేస్తావా? అంటూ ఆ కారు యజమాని అయిన విద్యార్థితో వాగ్వాదానికి దిగి ఇనుప చువ్వతో పొడిచాడు. మిగిలిన వారు చేయిచేసుకున్నారు. తనకు ఈ ఘటనతో సంబంధం లేదని, ఎవరో చేసిన దానికి తనను ఎందుకు వేధిస్తారంటూ విద్యార్థి వేడుకున్నా వినలేదు. కాసేపు అయ్యాక మద్యం మత్తు నుంచి తేరుకుని, పొరపాటు అయ్యిందని గ్రహించి రూ. వెయ్యి బాధితుడి చేతిలో పెట్టి పరారయ్యారు. ఈ తతంగం మొత్తాన్ని ఘటనా ప్రదేశానికి సమీపంలో ఉన్న ఓ సీసీ పుటేజీలో బయటపడింది. సమీప షాపు యజమానిని సంప్రదించి పోలీసులు వివరాలు సేకరించారు. బాధ్యులైన యువకులు నగరంలో బంగారం దుకాణాల్లో పనులు చేసేవారుగా తెలిసింది. బాగా రెచ్చిపోయిన యువకుడిది పొన్నూరుగా గుర్తించారు. ఆ యువకుడు ప్రస్తుతం సంగడిగుంటలో ఉంటున్నారని ఈకేసులో ఏ1గా అతన్ని పెడుతున్నట్లు చెప్పారు. వీరంతా అవివాహితులే. 22-23 ఏళ్లు ఉంటాయని తెలిపారు. కారుతో ఎవరు గుద్ది పరారయ్యారో గుర్తించలేకుండా ఉండటం ఒక తప్పు అయితే ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తిని పొడిచి ఇబ్బందిపెట్టడం మరో తప్పిదమని పోలీసులు చెబుతున్నారు.Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని