Password తెలుసుకుని.. రూ.లక్షలు కాజేశారు!
close

తాజా వార్తలు

Updated : 25/06/2021 11:42 IST

Password తెలుసుకుని.. రూ.లక్షలు కాజేశారు!

నారాయణగూడ, న్యూస్‌టుడే: కంపెనీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని మణప్పురం ఫైనాన్స్‌ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగుల యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు తెలుసుకొని రూ.30 లక్షలు కాజేశారు సైబర్‌ మోసగాళ్లు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ తెలిపిన ప్రకారం.. ఇటీవల మణప్పురం ఫైనాన్స్‌ కంపెనీ ‘గోల్డ్‌ లోన్‌ టు డోర్‌ స్టెప్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎవరైతే లోన్‌ అప్రూవల్‌ చేయడానికి వెళతారో.. వారికి వేర్వేరుగా యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు ఉంటాయి. ఇటీవల హిమాయత్‌నగర్‌ మణప్పురం ఫైనాన్స్‌ కంపెనీ నుంచి 1200 గ్రాముల బంగారానికి రూ.30లక్షలు లోన్‌ మంజూరు చేసినట్లుగా నివేదికలో నమోదైంది. వెంటనే హిమాయత్‌నగర్‌ బ్రాంచ్‌ ఉన్నతాధికారి సంబంధిత ఉద్యోగులను పిలిచి రూ.30 లక్షల లోన్‌ మంజూరు చేసినా.. బంగారం డిపాజిట్‌ చేయలేదని ప్రశించారు.   అసలేం జరిగిందో విచారించగా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి.. ‘‘తాము కేరళలోని ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. మీరు జీపీఆర్‌ఎస్‌కు అందకుండా పోతున్నారు. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ చెప్పండి’’ అంటూ తెలుసుకున్నారు. అనంతరం సైబర్‌ దొంగలు రూ.30 లక్షలు లోన్‌ మంజూరు చేయించుకున్నారు. జార్ఖండ్‌ ముఠా పనిగా భావిస్తున్నారు.

అప్రమత్తమై రూ.55 లక్షలు కాపాడారు.. నగరానికి చెందిన ఖాజా ఎంఎం ఖాదర్‌కు మాసబ్‌ట్యాంక్‌లో నిమ్రా సెర్‌గ్లాస్‌ టెక్నిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట సిరామిక్‌ ముడిసరకు, ఉత్పత్తుల వ్యాపారం ఉంది. చైనాలోని షాంఘై సొల్యూషన్స్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడింగ్‌ సంస్థకు ఇటీవల రూ.97,250 డాలర్ల విలువైన ఆర్డర్‌ ఇచ్చారు. ముందుగా  రూ.29,500 డాలర్లు ఆన్‌లైన్‌ ద్వారా పంపించారు. రెండు రోజుల తరువాత ఓ వ్యక్తి ఫోన్‌ చేసి ఇది వరకు మీరు డబ్బులు ఏ బ్యాంక్‌కు అయితే పంపించారో దాన్ని మార్చేశాం. మిగతా 70 శాతం కొత్త ఖాతాకు పంపించాలని చెప్పాడు. ఖాదర్‌ రూ.68,250 డాలర్లు (భారత కరెన్సీలో రూ.53.23 లక్షలు) పంపించేశారు. మీ ఆర్డర్‌ డెలివరీ అయింది. మిగతా 70 శాతం కూడా ఖాతాలో జమ చేయాలని చైనా సంస్థ చెప్పడంతో ఖాదర్‌ ఖంగుతిన్నారు.   తాను పంపిన సొమ్ము లండన్‌లోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్‌లో జమైనట్లు తెలిసింది. అక్కడి బ్యాంక్‌ అధికారులు అనుమానంతో హోల్డ్‌ చేశామని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని