close

తాజా వార్తలు

Updated : 04/12/2020 05:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మద్యం తాగించి హత్య చేసిన భార్య

అనుమానాస్పదం.. ‘అక్రమమే’!

కొమురవెల్లి పోలీసు స్టేషన్‌లో వివరాలు చెబుతున్న ఏసీపీ మహేందర్‌, సీఐ శ్రీనివాస్‌రెడ్డి

చేర్యాల, న్యూస్‌టుడే: మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోగా మందలించిన భర్తను నమ్మించి మద్యం తాగించి.. భార్య హత్య చేసింది. తొమ్మిది రోజుల క్రితం అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం వెల్లడైంది. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా కొమురవెల్లి పోలీసులు కేసును ఛేదించారు. వివరాలను ఏసీపీ సందెపోగు మహేందర్‌, చేర్యాల సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై నరేందర్‌రెడ్డితో కలిసి గురువారం వెల్లడించారు. ‘మల్లన్న’ గుట్ట హనుమాన్‌ గుడి పక్కన కుళ్లిపోయిన మృతదేహమున్నట్లు నవంబరు 24న అనుమానాస్పద కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టగా మృతదేహంపై గోరు కాట్లు కనిపించాయి. ఆలయ పరిసరాల్లో మృతుడు, మహిళ తిరుగాడినట్టు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు ఉన్నాయి. అదే ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై ముసుగు వేసుకున్న మరో వ్యక్తి వారిద్దరినీ వెంబడిస్తుండటం చూసి పోలీసులకు అనుమానం కలిగింది. జిల్లాలో 18 అదృశ్యం కేసుల ఫొటోలతో మృతుడి ఆనవాలును పరిశీలించారు. మూడు పోలీసు బృందాలు సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గోడపత్రికలు వేసి మరీ దర్యాప్తు చేశాయి. చివరికి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తు పట్టి చెప్పారు. అతను రాయపోల్‌ మండలం పెద్దఆరెపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి(40).. సీసీ కెమెరాల్లో ఉన్నది అతడి భార్య అని తేల్చారు. విషయం వెల్లడవుతోందని తెలుసుకున్న ఆమె పెద్దఆరెపల్లి గ్రామ సర్పంచి కరుణాకర్‌ సహాయంతో బుధవారం రాత్రి పోలీసులకు లొంగిపోయింది. ఆమె భర్తతో కలసి గజ్వేల్‌లో కూరగాయలు విక్రయించేది. జగదేవ్‌పూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన కొంతం నర్సింలుతో సాన్నిహిత్యం ఏర్పడింది. నర్సింలుతో ఆమె తిరుగుతుండగా చూసిన భర్త గొడవ పడ్డాడు. భర్తను అడ్డు తొలగించుకోవాలని ఆలోచించి కుట్ర చేసింది. దేవుని సమక్షంలో ఒక్కటై ఇకనుంచి కలిసిమెలసి ఉందామని నమ్మించింది. కొమురవెల్లి ఆలయానికి భర్త వచ్చేలా చేసింది. గుట్టపై బండరాళ్ల వద్ద ఎక్కువగా మద్యం తాగించి.. మత్తులో ఉన్న భర్తను గొంతు నులిమి చంపేసింది. సంఘటన స్థలంలో ఆధారాలు లేకుండా జాగ్రత్త పడింది. కొమురవెల్లికి వచ్చిన ప్రియుడు నర్సింలుతో కలిసి ద్విచక్రవాహనంపై పరారైంది. ఆమెను, నర్సింలును గురువారం రిమాండు చేశారు. కేసును ఛేదించిన సిబ్బందిని ఏసీపీ అభినందించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన