కూకట్‌పల్లి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

తాజా వార్తలు

Published : 01/05/2021 09:57 IST

కూకట్‌పల్లి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లిలో ఏటీఎం సిబ్బందిపై కాల్పుల జరిపి.. నగదు ఎత్తుకెళ్లిన కేసును సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. దోపిడీకి పాల్పడిన ఇద్దరిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడి నుంచి సేకరించిన వివరాలను పోలీసులు ఇవాళ సాయంత్రం లేదా రేపు వెల్లడించే అవకాశం ఉంది.

రెండ్రోజుల క్రితం కూకట్‌పల్లి పటేల్‌కుంట పార్కు సమీపంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్ద ఏటీఎంలో సిబ్బంది డబ్బులు నింపుతుండగా.. ఆల్విన్‌ కాలనీ వైపు నుంచి పల్సర్‌ వాహనంపై బ్యాంకు వద్దకు వచ్చిన ఇద్దరు ఆగంతుకులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. అక్కడున్న ఇద్దరు ఏటీఎం సిబ్బందితో పాటు సెక్యూరిటీ గార్డుపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం వారి వద్ద ఉన్న రూ.5లక్షల డబ్బును దోచుకెళ్లిన విషయం తెలిసిందే.

దుండగుల కాల్పుల్లో ఏటీఎం సిబ్బంది అలీ బేగ్‌, శ్రీనివాస్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న స్థానికులు గాయపడిన వారిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అలీ బేగ్‌ మృతి చెందగా .. శ్రీనివాస్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్థానికంగా దొరికిన ఆధారాలతో పాటు సీసీ కెమేరాల పుటేజీ ఆధారంగా దుండగుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని