నిప్పంటుకుని తల్లీకుమార్తె సజీవదహనం
close

తాజా వార్తలు

Updated : 05/03/2021 13:36 IST

నిప్పంటుకుని తల్లీకుమార్తె సజీవదహనం

మెదక్‌: మెదక్‌ పట్టణంలోని అజంపురా కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని తల్లీకుమార్తె సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. మెదక్‌ మండలం తిమ్మానగర్‌కు చెందిన గట్టయ్య సీఆర్పీగా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా భార్య రేవతి, కుమార్తె ఆద్యశ్రీతో కలిసి మెదక్‌లోని అజంపురా కాలనీలో నివాసముంటున్నారు. రోజూ మాదిరిగానే గట్టయ్య విధులకు వెళ్లగా భార్య రేవతి ఇంట్లో వంటచేస్తున్న క్రమంలో ప్రమాదశాత్తూ చీరకు నిప్పంటుకుంది. రేవతితో పాటు ఆమె కుమార్తెకూ మంటలు అంటుకున్నాయి. కేకలు విన్న చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేలోపే ఇద్దరూ తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని