close

తాజా వార్తలు

Published : 04/08/2020 19:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాహనం బోల్తా: ఒకరి మృతి.. 14 మందికి గాయాలు

కొణిజర్ల: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం రాంపురం వద్ద బొలేరో ట్రాలీ వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, 14మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రుగుండ మండలం బాలికుంట గ్రామస్థులు మరిపెడబంగ్లాలో జరుగుతున్న ఓ శుభకార్యానికి బొలేరో ట్రాలీ వాహనంలో బయలుదేరారు. వేగంగా వచ్చిన వీరి వాహనం రాంపురం వద్దకు రాగానే అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మీ(40) అనే మహిళ మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై మొగిలి ప్రమాదస్థలికి చేరుకుని పరిశీలించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.