Crime: ఆధిపత్యం కోసమే రౌడీషీటర్‌ హత్య

తాజా వార్తలు

Updated : 20/07/2021 06:56 IST

Crime: ఆధిపత్యం కోసమే రౌడీషీటర్‌ హత్య

అయిదుగురు నిందితుల అరెస్టు ●

వీరిలో ఇద్దరు సోదరులు

నారాయణగూడ, న్యూస్‌టుడే: రౌడీషీటర్‌ ముస్తాక్‌ హత్య చేసిన కేసులో అయిదుగురిని చాదర్‌ఘాట్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో రౌడీషీటర్లు అయిన ఇద్దరు సోదరులు, ముగ్గురు అనుచరులు ఉన్నారు. నిందితుల నుంచి రెండు వాహనాలు, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నగర పోలీసు కమిషనరేట్‌లో పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ కేసు వివరాలు వెల్లడించారు. చాదర్‌ఘాట్‌ ఠాణా పరిధిలోని కొందరు రౌడీషీటర్లు స్థానిక హోటళ్లకు వెళ్లి బెదిరించి భోజనాలు చేయడం, సిగరెట్లు, పాన్‌లు తీసుకెళుతున్నారు. కొన్ని కారణాలతో రౌడీషీటర్‌ ముస్తాక్‌(37) తన ఇల్లు అమ్ముకొని హుమాయూన్‌నగర్‌ ఠాణా పరిధిలోకి మకాం మార్చాడు. స్థానికంగా పట్టుసడలిపోతుందన్న ఉద్దేశంతో చాదర్‌ఘాట్‌కు వస్తూపోతున్నాడు. ఓల్డ్‌ మలక్‌పేట్‌ అబూ బబార్‌ వాటర్‌ ట్యాంక్‌ వద్ద నివసించే డెయిరీ ఫాం వ్యాపారి మహమూద్‌ బిన్‌ అల్వీ(42), ఓఎల్‌ఎక్స్‌లో కార్ల వ్యాపారం చేసే అయూబ్‌ బిన్‌ అల్వీ(33) సోదరులు. వీరిద్దరిపై చాదర్‌ఘాట్‌ పోలీసు ఠాణాలో రౌడీషీట్లున్నాయి. స్థానికంగా మహమూద్‌ సోదరుల పరపతి పెరిగిపోతోందని, తనను పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదని ముస్తాక్‌ గ్రహించాడు. తట్టుకోలేక తాగినమైకంలో వారిని చంపేస్తానంటూ పదుగురికీ చెప్పేవాడు. ఆ విషయం మహమూద్‌ సోదరుల చెవిలో పడింది. అతన్ని చంపాలని నిర్ణయించుకున్నారు. స్నేహితులైన చాంద్రాయణగుట్ట ఫూల్‌బాగ్‌, అహ్మద్‌ కాలనీ, ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌ వద్ద నివసించే స్థిరాస్తి వ్యాపారి మహ్మద్‌ హైదర్‌అలీ ఖాద్రీ(36), ఓల్డ్‌ మలక్‌పేట్‌ అబూ బకర్‌ మసీదు దగ్గరుండే లేబర్‌ పని చేసే మహ్మద్‌ జుబేర్‌ అలియాస్‌ షేక్‌ జుబేర్‌(25), రామంతాపూర్‌, ఇందిరానగర్‌లో ఉండే ప్లంబర్‌ వలీ అహ్మద్‌ అలియాస్‌ బాబా (33)లతో కలిసి పథకం వేశారు. జులై 16 రాత్రి తన పాత ఇంటికి వచ్చిన ముస్తాక్‌పై మహమూద్‌ అయూబ్‌ బిన్‌ అల్వి, ఖాద్రీ, వలీ అహ్మద్‌ కత్తులతో దాడి చేశారు. గొడ్డలితో మెడపై నరికి, కడుపులో కత్తులతో దారుణంగా పొడిచారు. వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మలక్‌పేట్‌ అక్బర్‌బాగ్‌ కూడలిలో మహమూద్‌ను చాదర్‌ఘాట్‌ పోలీసులు అదుపులో తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని