close

ప్రధానాంశాలు

Published : 06/03/2021 05:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పిచ్చి కుక్క స్వైర విహారం

పది మంది చిన్నారులకు తీవ్ర గాయాలు

మాచర్ల గ్రామీణ, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా మాచర్లలోని రోప్‌వేకాలనీ, పీడబ్ల్యూడీ కాలనీ ప్రాంతాల్లోని శుక్రవారం పిచ్చి కుక్క స్వైర విహారం చేయడంతో పది మంది చిన్నారులు గాయపడ్డారు. దారిన పోయే వారితో పాటు అటు వైపు వెళ్లిన వారిపై తెగబడి విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన వారిలో భాను భీమేశ్వర్‌, భిష్ను, జ్యోతి, వెంకటసాయిప్రశాంత్‌, గౌతమ్‌, రిహానా, మహేష్‌ ఉన్నారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని మెరుగైన చికిత్సకు గుంటూరుకు తరలించారు. పిచ్చి కుక్కల బెడద ఉందని పురపాలక అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా స్పందించక పోవడం వల్లే ఇప్పుడిలా జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన