ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి
close

ప్రధానాంశాలు

Published : 21/06/2021 03:58 IST

ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి

బీజాపూర్‌ జిల్లాలో స్మారక స్తూపాల కూల్చివేత

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లా కొరవాయ, ఇతుల్‌ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు-డీఆర్జీ బలగాల మధ్య ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఓర్చా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మాడ్‌ డివిజన్‌కు చెందిన మావోయిస్టు దళాలు అడవిలో సంచరిస్తున్నట్లు పోలీస్‌ నిఘా అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు డీఆర్జీ (డిస్ట్రిక్ట్‌ రిజర్వు గార్డు) బలగాలు ఇతుల్‌, కొరవాయ, భట్బెరా, బడేతోండాబేడా, అడెర్‌ అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌ చేపట్టారు. మావోయిస్టు దళాలు.. డీఆర్జీ బలగాలను గమనించి కాల్పులకు దిగడంతో ఆత్మరక్షణ కోసం బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఇరువర్గాల మధ్య కొన్ని గంటల పాటు ఎదురు కాల్పులు కొనసాగాయి. ఘటనలో ఇద్దరు మావోయిస్టులు తుపాకీ తూటాలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం సంఘటనా స్థలం పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేయగా 303 బోర్‌ రైఫిల్‌, 315 బోర్‌ గన్‌, పిస్టల్‌, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం, కిట్‌ బ్యాగ్‌లు, ఇతర సామగ్రి లభించాయి. మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరి వివరాల కోసం బస్తర్‌ రేంజి ఐజీ సుందర్‌రాజ్‌, జిల్లా ఎస్పీ మోహిత్‌గార్గ్‌ దర్యాప్తు ప్రారంభించారు.

* మరో ఘటనలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా జంగ్లా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చోటేతుంగాలి అటవీ ప్రాంతాల్లో అమరులైన మావోయిస్టు నేతల స్మారక స్తూపాలను భద్రతా బలగాలు కూల్చివేశాయి. గతంలో కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు నేతల స్మారక స్తూపాలను ఇక్కడ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు నిర్మించారు. ఆదివారం గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలకు స్తూపాలు కంట పడడంతో వాటిని గడ్డ పారలతో తవ్వి నేలమట్టం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన