Published : 09/05/2021 07:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సర్పంచులకు త్వరలో చెక్‌ పవర్‌

సత్తెనపల్లి, న్యూస్‌టుడే : గ్రామ పంచాయతీ సర్పంచులకు చెక్‌ పవర్‌ లభించనుంది. ప్రత్యేకాధికారుల స్థానంలో వారి వివరాలను సీఎఫ్‌ఎంఎస్‌లో నమోదు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచిల వివరాలన్నీ నమోదైన తరువాత వారికి ఐడీ ఇచ్చి చెక్‌ పవర్‌ ఇవ్వనున్నారు. ఫిబ్రవరిలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తయ్యాయి. పోలింగ్‌ రోజే సర్పంచి ఫలితాలు వెల్లడైనప్పటికీ ప్రమాణ స్వీకారానికి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు వేచి చూశారు. అప్పటి నుంచి చెక్‌ పవర్‌ లేకపోవడంతో 14, 15వ ఆర్థిక సంఘం కింద మంజూరైన నిధుల సద్వినియోగంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణకు వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరోనాకు కళ్లెం వేసే చర్యలకు నిధులు ఖర్చు చేయాలన్నా సమస్యగా ఉంది. సర్పంచులకు చెక్‌పవర్‌ ఇచ్చి ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఇబ్బందుల్లేకుండా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు, మూడ్రోజులుగా రెండు జిల్లాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో నూతన సర్పంచుల వివరాల్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. సర్పంచిగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రం, ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఫొటో సేకరించి సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే వారికి చెక్‌ పవర్‌ వస్తుందని ఉన్నతాధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని