logo

వచ్చినప్పుడు ఒక మాట వెళ్లాక టాటా.. జగన్‌ మాటలు నీటి మూటలు

ఏటా టమాటా, ఉల్లి రైతులు నష్టపోతున్నామని ఈ ప్రాంతానికి చెందిన కర్షకులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. టమాటా జ్యూస్‌ ఫ్యాక్టరీ, ఉల్లి ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తాం.

Updated : 09 May 2024 08:35 IST

ఆదోనికి తప్పని ట్రాఫిక్‌ కష్టాలు
పత్తికొండ టమాటా రైతులకు మొండిచెయ్యే

  • ఏటా టమాటా, ఉల్లి రైతులు నష్టపోతున్నామని ఈ ప్రాంతానికి చెందిన కర్షకులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. టమాటా జ్యూస్‌ ఫ్యాక్టరీ, ఉల్లి ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తాం. వెంటనే వీటికి సంబంధించిన పనులు ప్రారంభించాలని అక్కడే ఉన్న కలెక్టర్‌ను ఆదేశించారు.

(నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలో 2023 జూన్‌ 1న రైతు భరోసా సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు వచ్చిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రకటించారు.)

స్థలం ఎంపికలోనూ లోపమే

ఇక్కడ కనిపిస్తున్న ఈ రాళ్లగుట్ట టమాటా, ఉల్లి ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు చేసేందుకు అధికారులు పత్తికొండలో గుర్తించిన స్థలం. ఈ బండరాళ్ల నడుమ నిర్మాణం చేపçË్టడం అంత సులువు కాదు. పరిశ్రమల ఏర్పాటు కోసం అధికారులు మూడు ఎకరాలకు పైగా స్థలం అవసరమని ధ్రువీకరించారు. పట్టణ సమీపంలో ఈ రాళ్ల గుట్టలను ఎంపిక చేశారు. ఏడాది కావస్తున్నా.. అడుగు కూడా ముందుకు పడలేదు.

  • ఉల్లి ప్రాసెసింగ్‌ యూనిట్‌కు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టలేదు. సాగు చేసే రైతులు మాత్రం నష్టపోతున్నారు. పెట్టుబడి సైతం దక్కని పరిస్థితి. రూ.లక్షలు వెచ్చించి నష్టాలు చవిచూస్తున్నారు. హామీ నెరవేరకపోవడంతో ఉల్లి రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
  • ఆదోని ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి రూ.50 కోట్లతో త్వరలో ఆదోని పట్టణంలో రహదారులు విస్తరించి, పురవాసుల ట్రాఫిక్‌ కష్టాలు తీరుస్తాను. త్వరలో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటా.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

(2022 జులై 5వ తేదీన ఆదోని పట్టణంలోని మున్సిపల్‌ మైదానంలో జగనన్న కానుకలు పంపిణీ కార్యక్రమానికి వచ్చిన   సందర్భంలో ఇచ్చిన మాట.)

  • హంద్రీనీవా కాలువ పరిసర ప్రాంత రైతుల భూములను సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాంతానికి పంట కాల్వలు మంజూరు చేసి, నిర్మాణం చేపడతాం.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

పంటల కాల్వల పనులు చేపట్టలేదు. ఒక్క పైసా మంజూరు చేయలేదు. నిర్మాణ పనుల ఊసే లేదు. పంట కాల్వల నిర్మాణంతో 37వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. మాటలతోనే సరిపెడుతున్నారు. అన్నదాతల బాగోగులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కపైసా ఇవ్వలేదు..

  • మారెళ్ల- బొందిమడుగుల గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేసి, నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.

(2023 జూన్‌ 1న పత్తికొండలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి) దారి తప్పారు

తుగ్గలి మండలం మారెళ్ల- బొందిమడుగుల గ్రామాల మధ్య వాగుపై రాకపోకల కోసం గతంలో నిర్మించిన వంతెన కూలిపోయి ఏళ్లు గడుస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. వంతెన పక్కన తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డుపైనే ఈ ప్రాంత ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. వంతెన నిర్మాణంపై ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధిలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి వచ్చినప్పుడు ప్రజలకు మాట ఇవ్వడం.. ఇక్కడి నుంచి వెళ్లాక ఆ మాటకు టాటా చెప్పడం పరిపాటిగా మారింది. ఇచ్చిన మాటకు టాటా చెబుతున్నారు.. ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తున్నారు. ఆదోని పట్టణ ప్రజల ట్రాఫిక్‌ సమస్య పరిష్కరిస్తానని పదే పదే చెప్పారు. పత్తికొండ ప్రజలకు సాగునీరు అందిస్తానని, టమాటా రైతులకు భరోసా ఇస్తానని నమ్మించారు. ఏళ్లు గడుస్తున్నా.. వారి కన్నీళ్లు మాత్రం తుడవలేకపోయారు. చెప్పిన మాటలు నీటి మూటలుగానే మారాయి. ఆదోని, పత్తికొండ వాసులకు ఎదురుచూపులే మిగిలాయి.

హామీలకు ఐదేళ్లు..

2017 డిసెంబర్‌లో సంకల్ప యాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన జగన్‌.. హంద్రీనీవా పరిసర ప్రాంత రైతులకు పంట కాల్వల నిర్మాణం, పందికోన జలాశయం సామర్థ్యం పెంపు, పత్తికొండలో టమాటా జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు, స్థానికంగా పాలిటెక్నికల్‌ కళాశాల మంజూరు.. ఇలా హామీలు గుప్పించారు. అధికారం చేపట్టి ఐదేళ్లు గడుస్తున్నా.. ఏ ఒక్కటీ  నెరవేర్చలేక పోయారు.

తప్పని కష్టాలు

ఆదోని పట్టణంలోని పుర ప్రధాన రహదారులైన ఎంఎం రోడ్డు, పీఎన్‌ రోడ్డులో రాకపోకలు సాగించాలంటే నరకమే. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ రహదారిపై వాహనం నడపాలంటే పద్మవ్యూహాన్ని దాటడమే. ఎటునుంచి ఏ వాహనం వస్తుందో.. ఎక్కడ నిలుపుతారో తెలియని పరిస్థితి. ఈ రహదారుల్లోనే వ్యాపార సముదాయాలు ఉండడంతో నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటోంది. దశబ్దాలుగా ప్రజలు ట్రాఫిక్‌ సమస్యతో ఇబ్బందులు పడుతున్నా.. ఎవరూ పట్టించుకోకపోవడం బాధాకరమని పురవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని