100 పడకల కొవిడ్‌ ఆస్పత్రి ప్రారంభం
Published : 16/05/2021 06:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

100 పడకల కొవిడ్‌ ఆస్పత్రి ప్రారంభం

కొవిడ్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ ఇంతియాజ్‌ తదితరులు

కొత్తాసుపత్రి కూడలి, న్యూస్‌టుడే: విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి అనుబంధంగా కొవిడ్‌ రోగులకు వైద్య సేవలు అందించేందుకు ఎన్టీఆర్‌ కాలనీలోని వెన్యూ కన్వెన్షన్‌లో 100 పడకలతో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వైద్య సేవలందించేందుకు విజయవాడలోని జనరల్‌ ఆస్పత్రి కేంద్రంగా మారిందని, కొవిడ్‌ బాధితులతోపాటు, అత్యవసర కేసులకు చికిత్స అందిస్తున్నామన్నారు. కరోనా రోగులు పెరుగుతున్నందున ప్రభుత్వ ఆస్పత్రిపై ఒత్తిడిని తగ్గించే క్రమంలో వెన్యూ కన్వెన్షన్‌లో ఆక్సిజన్‌తో కూడిన వంద పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చామన్నారు. దీనికి సహకారం అందించిన సుజనా ఫౌండేషన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. వెన్యూ కేంద్రంలో విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బంది, రోగులకు ఫౌండేషన్‌ వారే భోజన సదుపాయాలు, తాగునీరు వంటి సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారని వివరించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్స అందిస్తున్న కొంత మంది నిపుణులైన వైద్యులను, సిబ్బందిని సోమవారం నుంచి రొటేషన్‌ పద్ధతిలో ఇక్కడ సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. జేసీ(అభివృద్ధి) ఎల్‌.శివశంకర్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుహాసిని, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివశంకర్‌ తదితరులు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని