‘పేద బ్రాహ్మణులకు ఆసరా ఏదీ?’
eenadu telugu news
Published : 16/09/2021 03:43 IST

‘పేద బ్రాహ్మణులకు ఆసరా ఏదీ?’


నిరసన వ్యక్తం చేస్తున్న తెదేపా నాయకులు

అలంకార్‌కూడలి (విజయవాడ), న్యూస్‌టుడే : రాష్ట్రంలో పేద బ్రాహ్మణులకు వైకాపా ప్రభుత్వం ఆసరా కల్పించడంలో విఫలమైందని తెదేపా పొలిట్‌బ్యూరో బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. బుధవారం నగరంలోని ధర్నాచౌక్‌లో బ్రాహ్మణ సంఘాల ఐక్య వేదిక కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు, బ్రాహ్మణుల అభ్యున్నతికి నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, వారి సంక్షేమానికి పాటు పడ్డారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఒక్క బ్రాహ్మణుడికైనా ఆర్థిక సాయం చేసిన దాఖలాలు లేవని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పేద బ్రాహ్మణులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా వైష్ణవ శాఖ నాయకులు ములుగు కిరణ్‌, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘం నాయకులు గారపాటి విజయ్‌కుమార్‌, చిత్రపు శ్యామ్‌ సుందర్‌ శర్మ, మంగళంపల్లి నాగదుర్గ, తెదేపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని