పెసలకు మద్దతు ధర రూ.7,275
eenadu telugu news
Published : 19/10/2021 04:02 IST

పెసలకు మద్దతు ధర రూ.7,275

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: నాఫెడ్‌ ఆధ్వర్యంలో పెసలు కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్టు జేసీ కె.మాధవీలత తెలిపారు. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.7,275లు నిర్ణయించినట్టు సోమవారం ప్రకటించారు. 12 శాతం తేమ, పాక్షికంగా దెబ్బతిన్న/రంగు మారిన గింజలను 4 శాతం వరకు అనుమతిస్తామన్నారు. ఈ-క్రాప్‌లో నమోదైన విస్తీర్ణాన్ని అనుసరించి, ఆయా రైతు భరోసా కేంద్రాల్లో రైతులు తమ పేర్లను సీఎం యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. ప్రక్రియ ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు వివరించారు. ఏపీ మార్క్‌ఫెడ్‌, మార్కెటింగ్‌ శాఖ, సొసైటీలు, డీసీఎంఎస్‌ల ద్వారా ఈ-క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతుల నుంచి కొనుగోలు చేస్తారన్నారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 0866-2471015 లేదా 96520 95861 నంబర్లకు తెలియజేయాలని సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని