మాస్క్‌లు ధరించని వారిపై కేసులు
eenadu telugu news
Published : 20/10/2021 04:45 IST

మాస్క్‌లు ధరించని వారిపై కేసులు

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : కర్ఫ్యూ ఆంక్షలు, 144 సెక్షన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు మంగళవారం కేసులు నమోదు చేశారు. 144 సెక్షన్‌ నిబంధనల ఉల్లంఘనలపై విపత్తుల నిర్వహణ చట్టం 2005 కింద 3 కేసులు నమోదు చేశారు. సరైన కారణం లేకుండా రోడ్లపై తిరుగుతూ కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన 2,388 మంది వాహన చోదకులకు చలానాలు రాశారు. రూ.6,69,140లు జరిమానా విధించారు. మాస్క్‌లు లేకుండా రోడ్లపై తిరుగుతున్న 250 మందిపై కేసులు నమోదు చేసి రూ.30,000లు జరిమానా విధించారు. కమిషనరేట్‌ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ పట్టుబడిన 36 మందిపై కేసులు నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని