వైకాపా గూండాల దాడులు దారుణం: జీవీ
eenadu telugu news
Published : 20/10/2021 04:45 IST

వైకాపా గూండాల దాడులు దారుణం: జీవీ

మాట్లాడుతున్న జీవీ ఆంజనేయులు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై వైకాపా గూండాలు దాడులకు తెగబడటం దారుణమని నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయం, వైజాగ్‌లోని తెదేపా ప్రధాన కార్యాలయం, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై వైకాపా నాయకులు, కార్యకర్తలు దాడుల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా.. ప్రభుత్వం ఉందా.. పోలీసు వ్యవస్థ ఉందా?.. అని ప్రశ్నించారు. ‘పక్కా ప్రణాళికతోనే ఏకకాలంలో తెదేపా కార్యాలయాలు, నేతల ఇళ్లపై కర్రలు, రాళ్లతో దాడులు చేశారని, వందల సంఖ్యలో వైకాపా కార్యకర్తలు వస్తుంటే పోలీసులు ఏమి చేస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి, డీజీపీ బాధ్యత వహించాలి. ఇంత దారుణం జరిగితే స్పందించని పోలీసు శాఖ తీరు చూస్తుంటే జాలేస్తుంది. మాకు ఎక్కువ కార్యకర్తల బలం ఉంది. ప్రజాస్వామ్యంపై గౌరవంతో ఓపిగ్గా ఉంటున్నాం. మేము కూడా అదేపని చేస్తే మీ పార్టీ కనిపించదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని తక్షణమే కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి’.. అని డిమాండ్‌ చేశారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని