రూ.90 లక్షల చోరీ నగదు స్వాధీనం
Published : 06/05/2021 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.90 లక్షల చోరీ నగదు స్వాధీనం

ఇద్దరు నిందితుల అరెస్టు

నిందితులు, నగదును చూపిస్తున్న పోలీసులు

పలమనేరు, న్యూస్‌టుడే: రూ.90 లక్షల చోరీ నగదును గంగవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నిందితులను అరెస్టు చేసి పలమనేరు కోర్టులో హాజరు పరిచారు. డీఎస్పీ గంగయ్య కథనం మేరకు.. గండ్రాజుపల్లె చెక్‌పోస్టు వద్ద బుధవారం వేకువజామున 2.30 గంటలకు బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వస్తున్న ఓ కారును తనిఖీ చేశారు. అందులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా రెండు బ్యాగులను పట్టుకుని కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే చోరీ సంగతి వెలుగు చూసింది. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం నదియా గ్రామానికి చెందిన యువకుడు శుభకర్‌షిల్‌(26), అదే గ్రామానికి చెందిన స్నేహితుడు సంజుసాహా(27) కలిసి ఈనెల 2వ తేదీ బెంగళూరు నగరం ఎంహెచ్‌ఆర్‌ లేఅవుట్‌లో తాళమేసిన ఇంట్లో చోరీ చేశారు. ఎర్రప్ప అనే వ్యక్తికి చెందిన ఇంటిలోని అల్మారాలో ఉన్న రూ.90 లక్షల నగదును చోరీ చేసి నిందితులు సొంత రాష్ట్రానికి వెళుతుంటే పట్టుకున్నామని డీఎస్పీ వివరించారు. నిందితులు గతంలో కూడా పలు చోరీలతో సంబంధం ఉన్నట్లు అంగీకరించినట్లు చెప్పారు. నిందితులను పట్టుకున్న గంగవరం ఎస్‌ఐ సుధాకరరెడ్డి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని