న్యాయమూర్తుల నియామకం
eenadu telugu news
Published : 24/09/2021 06:28 IST

న్యాయమూర్తుల నియామకం

మసీదుసెంటర్‌, సాంబమూర్తినగర్‌(కాకినాడ), న్యూస్‌టుడే: జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడలోని ప్రత్యేక న్యాయస్థానాలకు జిల్లా జడ్జిలను నియమిస్తూ గురువారం రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. కాకినాడ పోక్సో ప్రత్యేక కోర్టుకు ఎల్‌.వెంకటేశ్వరరావు, రాజమహేంద్రవరం ఫ్యామిలీ కోర్టు, తొమ్మిదో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తిగా ఎం.గురునాథ్‌, రాజమహేంద్రవరం స్పెషల్‌ ఎస్సీ, ఎస్టీ కోర్టు, పదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా ఎం.నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం ఎనిమిదో అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి, స్పెషల్‌ కోర్టు ఫర్‌ అఫెన్సెస్‌ ఎగెనెస్ట్‌ ఉమెన్‌ న్యాయమూర్తిగా పి.ఆర్‌.రాజీవ్‌ నియమితులయ్యారు. వీరంతా వివిధ జిల్లాల్లో పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై ఇక్కడికి వస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని