
పశ్చిమ గోదావరి వాసి దారుణ హత్య
దుండిగల్, న్యూస్‌టుడే: పండక్కి ఊరెళ్లి వచ్చిన రెండు రోజులకే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. యూసఫ్‌గూడకు చెందిన శివాజీకి బౌరంపేటలో 300 గజాల స్థలం ఉంది. అందులో రేకులషెడ్డులో పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొరగనమూడిపాలేనికి చెందిన శివాగౌడ్(48) ఉంటున్నాడు. స్థలం యజమాని అక్కడికి దగ్గరలో ఉన్న తన మరో స్థలంలో ర్యాంప్ నిర్మించాలనుకొని ఓ మేస్త్రీకి పనులు అప్పగించాడు. కావాల్సిన సిమెంటు శివాగౌడ్ వద్ద ఉంది తీసుకొమ్మని ఆదివారం ఉదయం మేస్త్రీకి ఫోన్‌చేసి చెప్పాడు. ఆయన వెళ్లి చూసేసరికి శివాగౌడ్ రక్తపు మడుగులో విగతజీవిగా పడిఉన్నాడు. ఘటనా స్థలాన్ని పేట్‌బషీరాబాద్ పోలీసులు పరిశీలించారు. తెలిసిన వారే శనివారం రాత్రి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.
Tags :