Updated : 25/01/2021 17:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీసీ కెమెరా 100మంది పోలీసులతో సమానం

తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి

హైదరాబాద్‌: శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను వినియోగించడంలో తెలంగాణ పోలీస్‌ వ్యవస్థ అగ్రస్థానంలో ఉందని డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా శాంతిభద్రతలను ప్రాధాన్యతగా తీసుకొని ప్రభుత్వం పోలీసు శాఖకు అధిక నిధులు కేటాయిస్తోందన్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 2,058 సీసీ కెమెరాలను డీజీపీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ... సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ప్రజల్లో భరోసా పెరిగిందన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

ప్రతి పౌరుడి కదలికలను గుర్తించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఒక్కో సీసీ కెమెరా వందమంది పోలీసులతో  సమానమని చెప్పారు. తెలంగాణలో సీసీ కెమెరాలు పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు స్పష్టం చేశారు. సామాన్య ప్రజలకు సీసీటీవీ కెమెరాలు రక్షణ కవచంగా ఉంటాయన్నారు. కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వారందరికీ డీజీపీ ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఇదీ చదవండి..

ఎన్నికలను రీషెడ్యూల్‌ చేసిన ఎస్‌ఈసీ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని