పాత నేరస్థుడి దారుణ హత్య
eenadu telugu news
Published : 27/07/2021 02:41 IST

పాత నేరస్థుడి దారుణ హత్య

ఇటుకతో కొట్టి.. వృషణాలకు బనియన్‌తో బిగించి..


యాదగిరి

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడే పాత నేరస్థుడిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది. సీఐ వేణుగోపాల్‌రెడ్డి, నేరవిభాగం సీఐ శ్రీనివాసులు కథనం ప్రకారం..పటాన్‌చెరు మండలం చిట్కుల్‌ గ్రామానికి చెందిన యాదగిరి(35)కి 12 ఏళ్ల క్రితం వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం చిట్టిగిద్ద గ్రామానికి చెందిన సంతోషతో వివాహం అయింది. వీరికి దీపక్‌, రిష అనే 8 ఏళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. యాదగిరి కూలి పనిచేస్తుండటంతో ఆదాయం సరిపోక చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడేవాడు. రోజూ తాగొచ్చి భార్యను, తల్లి నీలమ్మను కొట్టేవాడు. కొడుకు వేధింపులు భరించలేక తల్లి మేనల్లుడు వద్ద ఉంటోంది. ఈ నెల 25న మద్యం తాగి వచ్చి భార్య సంతోషను విపరీతంగా కొట్టి రాత్రి 7 గంటలకు బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. గ్రామపరిధిలో ఉన్న సాదన్య వెంచర్‌లో యాదగిరిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సిమెంట్‌ ఇటుకతో తలపై మోది, బనియన్‌తో వృషణాలను బిగించి హత్య చేశారని ఉదయం ఈ వెంచర్‌ వాచ్‌మెన్‌ లక్ష్మయ్య తల్లికి తెలిపాడు. ఆమె వెళ్లి చూసే సరికి యాదగిరి చనిపోయి ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదగిరి 2016లో ఓ వ్యక్తిపై దాడి చేయగా అతను మృతి చెందడంతో పటాన్‌చెరు ఠాణాలో అప్పట్లో కేసు నమోదైంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగిందా? వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని