క్రీడా అవసరాలు తీర్చాలి
eenadu telugu news
Published : 21/09/2021 02:11 IST

క్రీడా అవసరాలు తీర్చాలి

కేంద్ర మంత్రిని కోరిన శ్రీనివాస్‌ గౌడ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారని, వాళ్లకు మరిన్ని సదుపాయాల కల్పన కోసం కేంద్రం నిధులు మంజూరు చేయాలని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కోరారు. దేశంలో ఆటలను ప్రోత్సహించడం, భారత్‌ను అగ్రశ్రేణి క్రీడా దేశంగా తీర్చిదిద్దాలనే విషయంపై సోమవారం అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల క్రీడా మంత్రులతో అనురాగ్‌ వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో అత్యున్నత క్రీడా విధానం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అందు కోసం వివిధ దేశాల క్రీడా విధానాలను అధ్యయనం చేస్తున్నాం. మెదక్‌, కరీంనగర్‌, వరంగల్‌లో సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు. మహబూబ్‌నగర్‌లో సింథటిక్‌ ట్రాక్‌, సిద్ధిపేటలో బహుళ వినియోగ స్టేడియం నిర్మాణం, షూటింగ్‌, బ్యాడ్మింటన్‌, హాకీ లాంటి క్రీడల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం సమర్పించిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలపాలి. వెంటనే నిధులు మంజూరు చేయాలి. రాష్ట్రానికి మరో మూడు క్రీడా పాఠశాలలను కేటాయించాలి’’ అని అనురాగ్‌ను కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని