KTR Vs Revanth: రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ పరువునష్టం దావా.. సిటీ కోర్టులో విచారణ
eenadu telugu news
Updated : 21/09/2021 20:00 IST

KTR Vs Revanth: రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ పరువునష్టం దావా.. సిటీ కోర్టులో విచారణ

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వేసిన పరువునష్టం దావా పిటిషన్‌పై సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. పరువు నష్టం దావాలో ఇన్‌జంక్షన్‌ ఆర్డర్స్‌పై వాదనలు ముగిశాయి. వాదలను ముగియడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కేటీఆర్‌ న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై మరికాసేపట్లో న్యాయస్థానం తీర్పు వెల్లడించే అవకాశాలున్నాయి.

మాదకద్రవ్యాల కేసుతో ముడిపెడుతూ రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారని నిన్న రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ పరువునష్టం దావా వేశారు. తప్పుడు ఆరోపణలను పరువునష్టం చర్యలుగా పరిగణించి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పేలా రేవంత్ రెడ్డిని ఆదేశించాలని సిటీ సివిల్ కోర్టును కేటీఆర్ కోరారు. పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలన్నారు. తన పరువుకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను ట్విటర్, ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేలా రేవంత్‌ను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఈడీ డ్రగ్స్ కేసుతో ముడిపెడుతూ తనపై తప్పుడు, పరువునష్టం వ్యాఖ్యలు చేయకుండా రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులను నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని