ఆలస్యంగా ప్రారంభమైన ఐఈఎల్‌టీఎస్‌ పరీక్ష
eenadu telugu news
Published : 26/09/2021 03:48 IST

ఆలస్యంగా ప్రారంభమైన ఐఈఎల్‌టీఎస్‌ పరీక్ష

ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు


నిర్వాహకులతో వాగ్వాదం

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: ఇంగ్లిష్‌ మాట్లాడే దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లే వారి కోసం నిర్వహించిన ది ఇంటర్నేషనల్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టం(ఐఈఎల్‌టీఎస్‌) పరీక్ష నిర్వహణ ఆలస్యం కావడంతో గచ్చిబౌలిలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఐడీపీ సంస్థ ప్రతి నెలా నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ పరీక్షను నిర్వహిస్తుంది. శనివారం గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్‌ సెంటర్‌లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాలు, నగరం నుంచి 430 మంది విద్యార్థులు పరీక్షకు వచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలు కావాల్సిన పరీక్ష 3.30 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 11.30కు హాల్లోకి వెళ్లిన విద్యార్థులు ఎంతకూ బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహించారు. సాయంత్రం 6.30కు పరీక్ష ముగిసింది. డీజే శబ్దంతో అసౌకర్యం కలిగిందని, ఆలస్యమైనా తమకు అల్పాహారం ఇవ్వలేదని విద్యార్థులు వాపోయారు. స్థానిక పోలీసులు చేరుకొని తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. సాంకేతిక సమస్య వల్లే పరీక్ష నిర్వహణ ఆలస్యమైందని నిర్వాహకులు వివరణ ఇవ్వడంతో వారంతా శాంతించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని