ఇంధన ధరల పెంపుపై వినూత్న నిరసన
eenadu telugu news
Published : 20/10/2021 02:00 IST

ఇంధన ధరల పెంపుపై వినూత్న నిరసన

వాహనదారులకు రూ.59 చొప్పున తిరిగి ఇస్తున్న శివసేనారెడ్డి, నేతలు

నాంపల్లి, న్యూస్‌టుడే: పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కమిటీ మంగళవారం వినూత్నరీతిలో నిరసన తెలిపింది. నాంపల్లి ఏక్‌మినార్‌ సమీపంలోని హెచ్‌పీ బంకులో పెట్రోల్‌ పోయించుకున్న వాహనదారులకు రూ.59 చొప్పున డబ్బులు తిరిగి ఇచ్చి, ధరల పెంపు వల్ల నష్టాన్ని వివరించారు. లీటరు పెట్రోల్‌పై ప్రభుత్వాలు పన్నుల రూపంలో విధిస్తున్న రూ.59లను సుమారు 150 మంది వాహనదారులకు తిరిగి ఇచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.శివసేనారెడ్డి మాట్లాడుతూ.. 60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో రూ.60 దాటని పెట్రోల్‌ ధరను.. భాజపా సర్కారు ఏడేళ్లలో రూ.110కి పెంచిందన్నారు. దీనివల్ల రవాణా, నిత్యావసర ధరలూ పెరిగి పేద, మధ్య తరగతి ప్రజలు చితికిపోతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శులు రిషికేష్‌రెడ్డి, సామ్రాట్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు రోహిత్‌, నేతలు నరేష్‌, హరిదర్‌, మాజీద్‌, ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని