India Book of Records: రెండేళ్ల చిన్నోడికి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు
eenadu telugu news
Updated : 19/09/2021 10:19 IST

India Book of Records: రెండేళ్ల చిన్నోడికి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు

రికార్డు మెడల్‌తో వేదాంశ్‌ సాయిరెడ్డి

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: బుడిబుడి నడక.. బోసి నవ్వులతో అందరి అలరించే ఈ రెండేళ్ల బుడతడు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు దక్కించుకున్నాడు. కరీంనగర్‌ సప్తగిరికాలనీకి చెందిన అశోక్‌రెడ్డి, ఆశ్రితల కుమారుడు వేదాంశ్‌ సాయిరెడ్డి ప్రతిభను గుర్తించి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు వారు ప్రశంసిస్తూ కార్డు , మెడల్‌ను అందించారు. ఏడు పక్షులు, 24 జంతువులు, 22 శరీర భాగాలు, 10 ఆహారపు వస్తువులు, 13 పండ్లు, 2 కూరగాయలు, నంబర్స్‌, 8 జీకే ప్రశ్నలకు జవాబులు చెబుతాడు. 21 రకాల అభినయం, ప్రపంచ పటం , ఆకారాల పజిల్స్‌ పూర్తి చేస్తాడు. పేపర్‌ కప్పులతో పిరమిడ్‌ తయారు చేస్తాడు. వేదాంశ్‌ సాయిరెడ్డి ప్రస్తుతం రెండు సంవత్సరాల మూడు నెలల వయస్సులో ఇవన్నీ చేయడం తల్లిదండ్రులు, బంధు మిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని