ఆర్‌అండ్‌బీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
eenadu telugu news
Updated : 19/09/2021 03:03 IST

ఆర్‌అండ్‌బీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల (విద్యానగర్‌), న్యూస్‌టుడే: ఆర్‌అండ్‌బీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. శనివారం జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్లు, భవనాలకు సంబంధించిన అన్ని పనులు, అటవీ ప్రాంతంలోని సీసీ రోడ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. కొదురుపాకలోని రోడ్ల నిర్మాణం వేగవంతంగా చేపట్టాలని పేర్కొన్నారు. ముస్తాబాద్‌ మండలం పోత్గల్‌ గ్రామానికి సంబంధించిన పనులు పూర్తిచేయాలని తెలిపారు. పీఆర్‌ శాఖ 35 పనులకు టెండర్లను పూర్తిచేయాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, కిషన్‌రావు, శ్రీనివాస్‌రావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని