పకడ్బందీగా ప్రవర్తనా నియమావళి అమలు
eenadu telugu news
Published : 24/10/2021 04:29 IST

పకడ్బందీగా ప్రవర్తనా నియమావళి అమలు

నోడల్‌ అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్‌

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు ముత్తు కృష్ణన్‌ శంకర్‌నారాయణ, పోలీస్‌ పరిశీలకులు అనుపమ్‌ అగర్వాల్‌, వ్యయ పరిశీలకులు ఎస్‌హెచ్‌ ఎల మురుగు, సోబోద్‌ సింగ్‌, స్థానిక సీపీ సత్యనారాయణలతో కలిసి నోడల్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు పత్రికలు, ఛానళ్లలో ఇచ్చే ప్రకటనలు, యూట్యూబ్‌, సోషల్‌ మీడియా ప్రకటనలు, పెయిడ్‌ న్యూస్‌ వార్తలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ తప్పుడు వార్తలపై ఎప్పటికప్పుడు నివేదిక అందజేస్తుందన్నారు.  సమావేశంలో అదనపు పాలనాధికారి జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌, సహాయ పాలనాధికారి మయాంక్‌ మిత్తల్‌, జడ్పీ సీఈవో ప్రియాంక, నోడల్‌ అధికారులు మహమ్మద్‌ అబ్దుల్‌ కలీం, చంద్రశేఖర్‌, ఆడిట్‌ శాఖ డీడీ రాము, ఎల్‌డీఎం లక్ష్మణ్‌ తదితరుల పాల్గొన్నారు.

నిర్వహణకు సర్వం సిద్ధం చేయాలి

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నిర్వహణకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్‌, సీపీ సత్యనారాయణ, అదనపు పాలనాధికారి శ్యామ్‌ప్రసాద్‌లాల్‌, హుజూరాబాద్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని