పర్యాటకాభివృద్ధికి కృషి
eenadu telugu news
Published : 26/10/2021 02:39 IST

పర్యాటకాభివృద్ధికి కృషి

ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం

చేయిస్తున్న ఛైర్మన్‌ వరప్రసాద్‌రెడ్డి, ఎండీ సత్యనారాయణ

భవానీపురం (విజయవాడ), న్యూస్‌టుడే: రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఏపీ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఎ.వరప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఏపీ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌కు డైరెక్టర్లుగా నియమితులైన 12 మంది ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడ భవానీపురంలోని హరిత బరంపార్కు సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఛైర్మన్‌ వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రాధాన్యం కలిగిన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఎండీ సత్యనారాయణ మాట్లాడుతూ పర్యాటకంలో పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా టూరిజం పాలసీని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. అనంతరం డైరెక్టర్లతో ఛైర్మన్‌, ఎండీ ప్రమాణం చేయించారు. డైరెక్టర్లుగా ఆర్‌.శ్రీనివాసరావు (విజయనగరం), ఆర్‌.రేవతి (విశాఖపట్నం సౌత్‌), కర్రి శ్రీలక్ష్మీ (విశాఖపట్నం ఈస్ట్‌), నాగుళ్ల సత్యనారాయణ (కృష్ణా), పి.జరీనా బేగం (గుంటూరు), ఎస్‌.అల్లాభక్షు (వైఎస్‌ఆర్‌ కడప), ఎల్‌.జయన్న (జమ్మలమడుగు), వి.సాయికిషోర్‌రెడ్డి (కోడూరు), బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (పులివెందుల), కె.లక్ష్మీదేవి (నందికొట్కూరు), బి.జాహ్నవి (అనంతపురం అర్బన్‌), ఎం.భాస్కర్‌రెడ్డి (తంబాళపల్లి)లు ప్రమాణ స్వీకారం చేశారు. సంస్థ అధికారులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని