కంప్యూటర్‌ ద్వారా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
logo
Published : 05/07/2020 02:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కంప్యూటర్‌ ద్వారా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

నందికొట్కూరు, న్యూస్‌టుడే: ఈ నెల 8న రాష్ట్ర ప్రభుత్వం లాటరీ పద్ధతిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనుంది. దీని కోసం ఎన్‌ఐసీ నూతన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. కంప్యూటర్‌ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. వారికి కేటాయించిన ఇంటి స్థలం నెంబరు లబ్ధిదారుడి చరవాణికి వెళుతుంది. లబ్ధిదారుడు ఆ స్థలాన్ని తీసుకోవాల్సిందే. జిల్లాలోని పురపాలక సంఘాల పరిధుల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. రెవెన్యూ శాఖ ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల జాబితాను ఆర్డీవోలకు పంపారు. అక్కడి నుంచి అర్హుల జాబితా ఆయా తహసీల్దారు, పురపాలక సంఘాలకు చేరాయి. ఈ నెల 8న లాటరీ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక జరగాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. ఈ ఎంపికలో గందరగోళం చోటుచేసుకోవచ్చన్న ఉద్దేశంతో నూతన సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశారు. ఆర్డీవోల నుంచి వచ్చిన ఎక్సెల్‌ లబ్ధిదారుల జాబితాను పేస్టు చేసి నూతన సాఫ్ట్‌వేర్‌లో కాపీ చేయడం, అనంతరం స్టార్ట్‌ లాటరీ అలాట్‌మెంట్‌ క్లిక్‌ చేస్తే ఆటోమ్యాటిక్‌గా లబ్ధిదారులకు స్థలాల నంబర్ల కేటాయింపు జరుగుతుంది. ఈ నంబర్లు వెంటనే ఆయా లబ్ధిదారుల చరవాణులకు మేసేజ్‌ వెళతాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో టిడ్కో నిర్మించిన ఇళ్లను కంప్యూటర్‌ ఎంపిక ద్వారా కేటాయించనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని