
మూణ్నాళ్ల ముచ్చట..మరమ్మతులు తప్పవట

మరమ్మతులకు గురై సూర్యాపేట పుర కార్యాలయంలో షీ టాయిలెట్ బస్సు
సూర్యాపేట జిల్లా కేంద్రానికి వివిధ అవసరాల నిమిత్తం నిత్యం వేలాది మంది మహిళలు వస్తుంటారు. అత్యవసర సమయాల్లో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పుర యంత్రాంగం చర్యలు తీసుకుంది. పాత బస్సును కొనుగోలు చేసి దానిని షీ టాయిలెట్లా మార్పించారు. దీనికి పట్టణ నిధుల నుంచి రూ.20 లక్షలు ఖర్చు చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించిన ఈ వాహనాన్ని నిత్యం రద్దీ ప్రదేశాల్లో ఉంచేవారు. పాత బస్సు కావడంతో మూడు రోజులకోసారి మరమ్మతులకు గురవుతోంది. రూ.లక్షలు ఖర్చు చేసి కార్యాలయానికే పరిమితమవుతున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.
- సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే
Tags :