శరవేగంగా కూల్చివేత పనులు
logo
Published : 18/06/2021 02:58 IST

శరవేగంగా కూల్చివేత పనులు

యాదగిరిగుట్టలో రహదారి విస్తరణ కోసం భూసేకరణ స్థలంలో భవనాల కూల్చివేత

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: యాదగిరిగుట్ట ప్రధాన రహదారి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే బాధితుల బ్యాంకు ఖాతాలోకి పరిహారం జమ చేయడంతో యంత్ర సామర్థ్యం పెంచి పనులు చకచక సాగిస్తున్నారు. గురువారం యాక్సిస్‌ ఏటీఎం వరకు గల భవనాలను కూల్చివేశారు. రహదారిపై ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ దారికి అడ్డంగా బారికేడ్లు పెట్టినప్పటికీ కొందరు దాటి ప్రయాణాలు సాగించారు. బాధితులు, చూడటానికి వచ్చిన స్థానికులు, ఇనుప చువ్వలు సేకరించుకొనే పేదలు, రాళ్లను తరలించడానికి వచ్చిన జనంతో ఆ ప్రాంతం రద్దీగా మారింది. లాక్‌డౌన్‌ సమయంలోనూ జనాలు కదలలేదు, భౌతికదూరం పాటించలేదు. పాతగుట్ట చౌరస్తా వరకు రహదారి విస్తరించాల్సి ఉండడంతో దుకాణదారులు ముందస్తుగా తమ దుకాణాలు, నివాసాలు ఖాళీ చేస్తూ, సామగ్రిని తరలిస్తూ హడావుడిగా కనిపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని