మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు...
logo
Published : 17/05/2021 05:22 IST

మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు...

 నిర్ధారణ పరీక్షలకు నమూనాలు సేకరిస్తారు. పాజిటివ్‌ ఫలితం వచ్చినవారిని వైద్యాధికారి చూసి హోం ఐసోలేషన్‌, కొవిడ్‌ కేర్‌ సెంటర్‌, ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తారు. రోగిని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌, ఆసుపత్రులకు తరలించే విషయంలో వైద్యాధికారి బాధ్యత తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి గురించి ఏఎన్‌ఎం నిత్యం ఆరా తీస్తారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారి ప్రైమరీ కాంటాక్టులను ఆశా కార్యకర్తలు రోజు కలిసి పరిస్థితులను తెలుసుకుంటారు. అందరూ సహకరించాలి: కొవిడ్‌ కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఫీవర్‌ సర్వేకు ప్రజలు సహకరించాలి. శనివారం నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ జిల్లాలో ఆరు విడతలుగా జూన్‌ 1వ తేదీ వరకు జరుగుతుంది. ఇంటికి వచ్చే వైద్య సిబ్బంది పూర్తి ఆరోగ్య సమాచారం అందించి ప్రజలు సహకరించాలి. వారి సూచన మేరకు జాగ్రత్తలు పాటిస్తే వైరస్‌ వ్యాప్తిని వీలైనంత త్వరగా అరికట్టేందుకు అవకాశం ఉంటుంది.

- డాక్టర్‌ కేసీ.చంద్రనాయక్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, శ్రీకాకుళం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని