చెల్లింపులు సత్వరమే పూర్తి చేయాలి: జేసీ
logo
Published : 18/06/2021 03:51 IST

చెల్లింపులు సత్వరమే పూర్తి చేయాలి: జేసీ

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: భారత నౌకాదళం రాంబిల్లిలో చేపట్టిన ప్రత్యామ్నాయ నావికా స్థావరం (ఎన్‌ఎఒబి) ప్రాజెక్టులో అర్హులైన నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో నౌకాదళం, రెవెన్యూ, ఇరిగేషన్‌, మత్స్యశాఖ అధికారులతో సమావేశమై చెల్లింపుల పురోగతిపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎన్‌ఎఒడి ప్రాజెక్టుకు సంబంధించి అన్ని సమస్యలపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి తక్షణమే నివేదిక అందజేయాలన్నారు. గతంలో ప్రభుత్వం ప్రకటించిన మేరకు అర్హులైన వారికి ఎక్కడైనా చెల్లింపులు నిలిచిపోతే వెంటనే ఆయా మొత్తాలను అందజేయాలన్నారు. నౌకాదళ అధికారులు కెప్టెన్‌ ఆదినారాయణ, కెప్టెన్‌ రాజశేఖర్‌, కెప్టెన్‌ ఎస్‌.శివకుమార్‌, ఆర్డీఓలు సీతారామారావు, అనిత, ఇరిగేషన్‌ ఎస్‌ఈ సూర్యకుమార్‌, ఎన్‌ఎఒడి ఎస్‌డీసీ జోసెఫ్‌, మత్స్యశాఖ జేడీ పి.లక్ష్మణరావు, అచ్యుతాపురం, రాంబిల్లి తహసీల్దార్లు సమీక్షలో పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని