close

శనివారం, అక్టోబర్ 19, 2019

ప్రధానాంశాలు

మోక్షగుండం.. ఇంజినీర్లకు ఆదర్శం

జిల్లా పరిషత్తు, న్యూస్‌టుడే: మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీర్లకు ఆదర్శనీయులని జల వనరుల శాఖ నాణ్యత ప్రమాణాల విభాగం సీఈ శ్రావణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జల వనరుల శాఖ కార్యాలయంలో ఆదివారం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ 1861 సెప్టెంబరు 15న బెంగళూరు సమీపంలో ముద్దనహళ్లిలో విశ్వేశ్వరయ్య జన్మించారన్నారు. తెలుగు కుటుంబానికి చెందిన ఆయన ఎన్నో ఆనకట్టలు, జలాశయాలు, పరిశ్రమల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారన్నారు. 1884లో ముంబయి ప్రభుత్వంలో ఇంజినీరుగా చేరిన ఆయన ఏడు దశాబ్దాల పాటు సేవలందించినట్లు తెలిపారు. ఎందరినో ఇంజినీర్లను తయారు చేశారన్నారు. హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడటంతో పాటు తిరుపతి ఘాట్‌ రూట్‌ రూపకల్పనలోనూ ఆయన సేవలు ఉన్నాయన్నారు. నేటి ఇంజినీర్లు ఆయనను ఆదర్శంగా తీసుకుని సేవలు అందించాలన్నారు. అనంతరం మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈలు మాక్బుల్‌సాహెబ్‌, రాజశేఖర్‌, వెంకటరమణ, ఏఈఈ అసోసియేషన్‌ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి రవికుమార్‌, తరుణ్‌కుమార్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, ఓబుళరెడ్డి, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మార్గదర్శకులు..

మారుతీనగర్‌: మోక్షగుండం విశ్వేశ్వరయ్య భావితరాలకు మార్గదర్శకులని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ మహేశ్వరయ్య పేర్కొన్నారు. ఇంజినీర్స్‌ డే సందర్భంగా ఆదివారం ఎస్‌ఈ ఛాంబర్‌లో మోక్షగుండం చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఇంజినీర్లు మాట్లాడుతూ కాలానుగుణంగా సాంకేతిక నైపుణ్యం అందిపుచ్చుకుని, నిర్మాణ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించారన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ ఇంజినీర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, డీఈలు భరత్‌, నారాయణస్వామి, భాస్కర్‌రెడ్డి, రఘు, నాగేంద్ర పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.