close

ఆదివారం, డిసెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

నిమ్మరైతు కంటచెమ్మ..

 


నిమ్మ మొలకలు నాటిన పొలాన్ని పరిశీలిస్తున్న జేసీ-2

న్యూస్‌టుడే, డక్కిలి : జిల్లాలో ఉద్యాన పెంపకమైన నిమ్మ, మామిడి తోటలను సాగు చేస్తున్నారు. నిమ్మసాగులో జిల్లాదే అగ్రస్థానం. దేశ నలుమూలలకు జిల్లాలో గూడూరు, పొదలకూరు నిమ్మ మార్కెట్‌ల నుంచే నిమ్మకాయలు ఎగుమతి అవుతోంది. మెట్టప్రాంతాలైన ఈ రెండు క్లస్టర్‌ రైతులు దీర్ఘకాలిక పంటలైన నిమ్మ, మామిడి సాగుపై దృష్టిసారిస్తారు. ప్రత్యేకించి గూడూరు, పొదలకూరు క్లస్టర్‌ పరిధిలో నిమ్మసాగు మీద రైతులు అత్యధిక రాబడిని పొందుతారు. గత నాలుగేళ్ల నుంచి వర్షాభావ పరిస్థితులు కారణంగా ఉద్యాన పంటలకు నీరు సక్రమంగా అందక గూడూరు, పొదలకూరు క్లస్టర్‌ పరిధిలో అత్యధికంగా నిమ్మసాగు ఎండిపోయింది. ప్రతి ఏడాది ప్రభుత్వం ఉద్యానవన పంటలు సాగు చేసే సన్నకారు రైతులకు ఎకరంలో వేసే నిమ్మమొలకలు అయితే 110, మామిడి మొలకలు అయితే 70 చొప్పున వాటికి దిగుమతికి, నిమ్మమొలకలు నాటేందుకు కూలీలు ఖర్చును ప్రభుత్వం అందజేస్తుంది. మొలకల పెంపకానికి మూడేళ్లపాటు అయ్యే ఖర్చును సన్నకారు రైతులకు ఉపాధి కూలీల రూపంలో అందజేస్తుంది. వీటికయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇస్తుంది. ఎకరం నిమ్మసాగుకు సుమారు మూడేళ్ల కాలానికి రూ.1.25 లక్షలు మంజూరు చేస్తుంది. ఉద్యాన పంటల సాగుచేసే విస్తీర్ణాన్ని ప్రతిపాదించే బాధ్యతను వెలుగు శాఖకు అప్పగించారు. ఈ ఏడాది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్ణయించాలని ప్రభుత్వం సూచించింది.

సన్నకారు రైతుకు తిప్పలు

ఈ ఏడాది ఎన్‌ఆర్‌ఈజీసీ ద్వారా మొక్క పెంపకానికి సన్నకారు రైతులను ఎంపిక చేసి నివేదికలు పంపుతున్నారని తెలుసుకున్నారు. ఎండిన నిమ్మ చెట్ల స్థానంలో మళ్లీ నిమ్మసాగు చేయడానికి రైతులు సిద్ధమయ్యారు. గత ఏడాది నిమ్మకాయల ధరలు అత్యధికంగా పెరిగాయి. నిమ్మసాగు అయితే లాభాలు వస్తాయని మరికొంత మంది రైతులు కూడా నిమ్మసాగుకు సిద్ధమయ్యారు. సన్నకారు రైతులకు ప్రభుత్వం సాయం చేస్తుందని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి సన్నకారు రైతు ధ్రువీకరణ పత్రాలు పొంది, మండల ఎన్‌ఆర్‌ఈజీసీ కార్యాలయంలో జూన్‌ నుంచి ఆగష్టు నెల వరకు అధికారులు కోరిన విధంగా పత్రాలు అందజేశారు.అధికారులు పరిశీలించనిదే మంజూరు చేయమని తనిఖీలు చేపడుతున్నారు. డక్కిలి, కలువాయి మండలాల్లో అక్టోబర్‌ చివరి వారంలో ఒక విడత, నవంబర్‌ రెండో తేదీన రెండో దఫా జాయింట్‌ కలెక్టర్‌ -2 ఆధ్వర్యంలో నిమ్మసాగు చేసేందుకు ప్రతిపాదనలు పంపిన భూములను ర్యాండమ్‌గా పరిశీలించారు. 

నివేదికల అధారంగా నిర్ణయం తీసుకుంటాం జ్యోతిబసు, డ్వామా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌

జిల్లాలో రెండు వేల ఎకరాల నిమ్మసాగుకు మంజూరు చేయాలి. 2128 ఎకరాలకు ఇప్పటి వరకు మంజూరు చేశాం. కలెక్టర్‌ డక్కిలి, కలువాయి మండలాల నిమ్మసాగు విస్తీర్ణాన్ని పరిశీలించేందుకు జేసీ -2, ఉద్యానవనశాఖ ఏడీకి అప్పగించారు. వారి నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం.

ఇతనిపేరు కె.వేణునాయుడు. డక్కిలి మండలంలోని తీర్థంపాడు గ్రామానికి చెందిన రైతు. ఇతను జూన్‌ నెలలో నిమ్మమొక్కలకు ఎన్‌ఆర్‌ఈజీసీ పథకం ద్వారా అందించే సాయానికి కావాల్సిన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు మొక్కలను నాటారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

గత ఏడాది ఎండిన నిమ్మసాగు : 1463 హెక్టార్లు

బాధిత రైతులు : 2017

జిల్లాలో మొత్తం విస్తీర్ణం 17 వేల హెక్టార్లు

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.