close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

జాతీయ-అంతర్జాతీయ

ఓర్వకల్లు పొదుపు మహిళలు దేశానికే ఆదర్శం

● సమాఖ్య సమావేశంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి

సమావేశంలో మాట్లాడుతున్న కాటసాని,

ఓర్వకల్లు, న్యూస్‌టుడే : అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఓర్వకల్లు పొదుపు మహిళలు మహిళా లోకానికే ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం బాలభారతి పాఠశాల మైదానంలో మహిళా సమాఖ్య 25వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే కాటసాని దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. 1995లో ప్రారంభమైన పొదుపు ఉద్యమం అంచలంచెలుగా ఎదిగి ఆర్థికంగా అభివృద్ధికి బాటలు వేసుకోవటం అభినందనీయమన్నారు. మండల మహిళా సమాఖ్య గౌరవ సలహాదారు విజయభారతి మాట్లాడుతూ.. సమాఖ్య అభివృద్ధికి అందరి సహకారం అవసరమన్నారు. పొదుపు సంఘాల ఏర్పాటుతో వేలాది కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయని వివరించారు. అనంతరం 39 సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద ఎమ్మెల్యే చేతులమీదుగా రూ.1.69 కోట్లు చెక్కు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే దంపతులకు గజమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైకాపా సీనియర్‌ నాయకుడు సంజీవరెడ్డి, జిల్లా నాయకులు ప్రభాకరరెడ్డి, సుధాకరరెడ్డి, గోపాల్‌రెడ్డి, పాణ్యం మాజీ జడ్పీటీసీ సభ్యుడు సూర్యనారాయణరెడ్డి, డీసీఎంఎస్‌ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు నాగతిరుపాలు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం మండల మహిళా సమాఖ్య నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గౌరవ సలహాదారు విజయభారతి పేర్కొన్నారు. మండల అధ్యక్ష, కార్యదర్శులుగా విజయలక్ష్మి, తాజుద్దీన్‌, కోశాధికారిగా విజయమ్మ, ఉపాధ్యక్షురాలిగా ఫాతిమాబీ, సహాయ కార్యదర్శిగా పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

హాజరైన సభ్యులు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.