close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

బాలసదనంలో ఆర్జేడీ బస

పిల్లలతో మాట్లాడుతున్న ఆర్జేడీ శారదాదేవి

వెంకటగిరి, న్యూస్‌టుడే : వెంకటగిరి రాణిపేటలోని బాలసదనాన్ని గురువారం రాత్రి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ శారదాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలసదనంలో చిన్నారులతో వివిధ అంశాలపై మాట్లాడారు. వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. కార్యకర్తలు, ఆయాలు సమయపాలన పాటించాలన్నారు. బాలసదనంలో చిన్నారులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. పిల్లలకు వడ్డించే భోజనం మరింత రుచికరంగా ఉండాలని ఆదేశించారు. చిన్నారులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. రాత్రి చిన్నారులతో కలిసి నిద్రించి వారి దినచర్యను పరిశీలిస్తామని ఆమె వివరించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌, బోధనా సిబ్బంది పాల్గొన్నారు. అంతకముందు అంగన్‌వాడీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.