close

శనివారం, ఏప్రిల్ 04, 2020

ప్రధానాంశాలు

భోజన వసతి లేని పర్యాటకం

ఇబ్బందుల్లో సందర్శకులు
ఈనాడు, హైదరాబాద్‌

ఆహార రాజధాని మన భాగ్యనగరం. ఇరానీ ఛాయ్‌ నుంచి స్టార్‌ హోటల్‌ వరకూ ఎక్కడకు వెళ్లినా పసందైన భోజనం నగరం సొంతం. సామాన్యుల నుంచి భాగ్యవంతుల వరకూ అందరూ ఇక్కడ భోజనాలను ఆస్వాదిస్తారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడి భోజనం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, సదస్సులకు వచ్చిన వారు.. ఇక్కడి బిర్యాని రుచి చూడందే వెనుతిరగరు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న మన నగరంలో పర్యాటకులు మాత్రం ఆకలితో అలమటిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడా తెలంగాణ పర్యాటక శాఖ భోజన వసతి కల్పించలేదు. దీంతో సందర్శకులు చారిత్రక ప్రదేశాలకు ఎదురుగా ఉన్న హోటళ్లలో అపరిశుభ్ర వాతావరణంలో ఆకలి తీర్చుకుంటున్నారు. లేదంటే ప్యాకెట్‌ ఫుడ్‌ తిని కడుపు నింపుకోవాల్సిన దుస్థితి.

కోటకు వెళితే పస్తులే..
గోల్కొండ కోట..: ఒకప్పటి రాజప్రసాదం. రత్నాలు రాసులు పోసి అమ్మేవారు. ప్రస్తుతం కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. కోట దిగి వచ్చేసరికి పర్యాటకులకు ఆకలి వేస్తుంది. కిందకు దిగిన తర్వాత కానీ.. పైన కానీ తిందామంటే ఆహారం లభించదు. కోటకు దిగువున .. ఉన్న చిన్నాచితకా హోటళ్లలో తినాలంటే పర్యాటకులు కాస్త వెనుకడగు వేసే పరిస్థితి. చార్మినార్‌ కూడా కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలోనే ఉంది. అక్కడ తినడానికి కాదు కదా.. కనీసం నిల్చోడానికి అవకాశం లేని పరిస్థితి. సేదదీరుదామంటే అవకాశమే లేదు. దీంతో అక్కడే ఉన్న ఛాయ్‌ దుకాణాల్లో ఛాయ్‌, బిస్కట్లు తిని పర్యాటకులు తృప్తి పడుతున్నారు. కుతుబ్‌షాహీ టూంబ్స్‌ వద్ద కూడా భోజన వసతి కరవైంది. ఇక్కడ ఆఘాఖాన్‌ ట్రస్టు వారు రూ.కోట్లు ఖర్చు చేసి సమాధులను పునరుద్ధరిస్తున్నారు. త్వరలోనే హైదరాబాద్‌ రుచులను అందించే హోటల్‌ కూడా వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏళ్లు గడుస్తున్నా అందుబాటులోకి రాలేదు. పైగా టూంబ్స్‌ వద్ద కూడా.. ఇదే పరిస్థితి.

సాలార్‌జంగ్‌ మ్యూజియంలో..
సాలార్‌జంగ్‌ మ్యూజియంలో మాత్రం హరిత హోటల్‌ ఉంది. అయితే ఇందులో ఒకేసారి 20 నుంచి 30 మంది మాత్రమే తినగలరు. తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్వహించే నగర పర్యాటక యాత్రల్లో భోజనవసతికి ఇక్కడకు తీసుకువస్తారు. లేదంటే.. పాతబస్తీల్లోని పలు హోటళ్లకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తారు. పాతబస్తీలో మాంసాహారులు కొంతవరకూ ఆహారాన్ని ఆస్వాదించినా.. శాకాహారులు మాత్రం దిక్కులు చూడక తప్పని పరిస్థితి. లేదంటే ట్యాంక్‌బండ్‌ వద్దకు తీసుకువచ్చి.. అక్కడ లుంబినీ పార్కుకు చేరువుగా ఉన్న రిజర్వేషన్‌ కేంద్రం దగ్గర భోజన వసతి కల్పిస్తుంది. ట్యాంక్‌బండ్‌ చుట్టూ కొన్ని హోటళ్లున్నా.. అవన్నీ ప్రైవేటువి. తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ లేదా.. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడిచే హోటళ్లు మాత్రం లేవు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.