15న కానిస్టేబుల్ అభ్యర్థులకు చివరి దశ వైద్య పరీక్షలు
మహబూబ్నగర్ (నేరవిభాగం) : పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 15న చివరి దశ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిలో 113 మంది అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు పోలీసు కవాతు మైదానానికి చేరుకోవాలని కోరారు.