close

బుధవారం, ఆగస్టు 21, 2019

తాజా వార్తలు

ఆధార్‌ సేవాకేంద్రాలు ప్రారంభం

నారాయణగూడ, న్యూస్‌టుడే: బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారుల సేవా కేంద్రంలో ఆధార్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం సైఫాబాద్‌, ఆదర్శనగర్‌లలో హైదరాబాద్‌ టెలికాం డిస్ట్రిక్ట్‌ (హెచ్‌టీడీ) పీజీఎం డి.ఎస్‌.నాగేంద్ర, హెచ్‌టీడీ (సెంట్రల్‌) పీజీఎం జె.రవీంద్ర కలిసి వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 6 వేల ఆధార్‌ నమోదు కేంద్రాలు ప్రారంభమయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 173 ప్రారంభించాలని సంకల్పించామని, తొలుత మంగళవారం రెండు కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. సైఫాబాద్‌లోని ఆధార్‌ సేవా కేంద్రం ప్రతి రోజు (ఆదివారం మినహా) ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏఎం (సెంట్రల్‌) వి.ప్రసాద్‌, ఏజీఎం (ఇంటర్నల్‌) ఎం.రాములు, బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌ సీఎస్‌సీ సీఆర్‌ఓ ఎస్‌.బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.