close

తాజా వార్తలు

ఫలితాల తర్వాతే సమావేశమవుదాం: మమత

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ అనంతరం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు మే 21న భేటీ అవ్వాలని భాజపాయేతర పార్టీలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. గత గురువారం జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా పశ్చిమ్‌బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబుకు ఇదే విషయమై ఫోన్‌ చేసినట్లు సమాచారం. ఫలితాలు తేలిన తర్వాతే సమావేశమవ్వడం మంచిదని చంద్రాబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. భాజపాయేతర పార్టీలన్నింటికీ అనుకూలంగా ఉన్న ఏదో ఒక రోజు నిర్ణయించాలని చంద్రబాబుకు దీదీ విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే ఈ విషయంపై చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పోలిట్‌బ్యూరో సభ్యుడొకరు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ చోట్ల భద్రపరిచిన ఈవీఎంలపై మమత ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఆయా ప్రదేశాల్లో భాజపా యేతర పార్టీలన్నీ నిఘా ఉంచాలని ఆమె కోరినట్లు తెలిపారు. భాజపా పథకాలను  తుత్తునియలు చేయాలని దీదీ కోరాన్నారు. ఓట్ల లెక్కింపు సన్నాహాలను పరిశీలించడంతో పాటు స్ట్రాంగ్ రూంల భద్రతను ఆయా రాష్ట్రాల కీలక నాయకులు పర్యవేక్షించాల్సి ఉన్నందున మే 23 తర్వాతే సమావేశం నిర్వహించడం మంచిదని దీదీ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net