మళ్లీ మొదటికొచ్చిన ‘మఠం’ వివాదం

తాజా వార్తలు

Published : 01/07/2021 16:20 IST

మళ్లీ మొదటికొచ్చిన ‘మఠం’ వివాదం

అమరావతి: కడప జిల్లాలోని శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి శాశ్వత, తాత్కాలిక మఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవాదాయశాఖను ఆదేశించాలని కోరుతూ దివంగత మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. మఠానికి స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. మఠంపై నిర్ణయాలను ధార్మిక పరిషత్‌ తీసుకుంటుందని తెలిపారు. మఠాధిపతి ఎంపికకు ధార్మిక పరిషత్‌ అనుమతించిందా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలతో సోమవారం నాటికి అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ఆజాద్, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మఠంలో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. రెండు కుటుంబాల వారితో వేర్వేరుగా చర్చలు జరిపారు. అందరు ఒకే అభిప్రాయంతో ఉండాలని వారికి సూచించారు. చర్చల అనంతరం.. దివంగత పీఠాధిపతి మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామికే పీఠం దక్కే విధంగా కుటుంబసభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మఠం 12వ పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామి త్వరలోనే బాధ్యతలు తీసుకుంటారని ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ వెల్లడించారు. త్వరలోనే పీఠాధిపతి ప్రమాణ స్వీకారం వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వెల్లడించారు. ఆ తర్వాత ఏ జరిగిందో కానీ.. దివంగత మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని