కలలో అత్యాచారం చేశాడని మాంత్రికుడిపై ఫిర్యాదు

తాజా వార్తలు

Published : 25/06/2021 21:45 IST

కలలో అత్యాచారం చేశాడని మాంత్రికుడిపై ఫిర్యాదు

ఇంటర్నెట్‌ డెస్క్‌: శాస్త్ర, సాంకేతిక రంగంలో ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతోంది. నూతన సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. ఇలాంటి కాలంలో కూడా కొన్నిచోట్ల ప్రజలను మూఢ నమ్మకాల జాఢ్యం పట్టి పీడిస్తూనే ఉంది. మొన్న తమిళనాడులోని ఓ మహిళ తన కొడుక్కి దెయ్యం పట్టిందని తీవ్రంగా కొట్టగా.. ఆ బాలుడు చనిపోయాడు. తాజాగా బిహార్‌లో అలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది. 

బిహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ తన కుమారుడికి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఒక మాంత్రికుడి దగ్గరకు తీసుకువెళ్లింది. ఆ మాంత్రికుడు ఒక మంత్రాన్ని పఠించమని చెప్పగా ఆమె అలానే చేసింది. కానీ 15 రోజుల తర్వాత ఆమె కుమారుడు చనిపోయాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. తన కొడుకు చనిపోవడానికి కారణం చెప్పమని మాంత్రికుడిని నిలదీయడానికి వెళ్లగా తనని అత్యాచారం చేయబోయాడని, అప్పుడు తన కొడుకు వచ్చి కాపాడాడని పోలీసులకు తెలిపింది. అప్పటి నుంచి తనను కలలో పలుమార్లు అత్యాచారం చేశాడని సదరు మాంత్రికుడిపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. దాంతో మాంత్రికుణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో అతడిని విడిచి పెట్టేశారు. విచారణలో భాగంగా మహిళకు మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుసుకున్న పోలీసులు ఆమె బంధువులను పిలిపించారు. ఆమెను మానసిక నిపుణుల వద్దకు తీసుకువెళ్లమని సూచించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని